బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో కలకలం - హడలిపోయిన పోలీసులు

హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండా అమీర్‌పేట్ మెట్రో రైల్వే స్టేషన్‌లో మంగళవారం బాంబు కలకలం రేగింది. దీంతో బాంబ్‌స్క్వాడ్ ఉరుకులు పరుగులు పెట్టారు. చివరికి అది అనుమానిత వస్తువు అని, అది బాబు కాదని తేలడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇంతకీ ఏం జరిగిందంటే.. మెట్రో స్టేషన్‌లో ఆదిత్య ఎన్‌క్లేవ్‌వైపు ఉన్న చెత్త డబ్బాలో అనుమానిత వస్తువేదో ఉన్నట్టు గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది.. దానిని బాంబుగా భావించి పోలీసు కంట్రోల్ రూముకు సమాచారం అందించారు.
 
వారి నుంచి సమాచారం అందుకున్న బాంబ్‌స్క్వాడ్, ఎస్సార్ నగర్ పోలీసులు క్షణాల్లోనే స్టేషన్‌కు చేరుకుని తనిఖీ చేశారు. చివరికి పోలీసు జాగిలం సాయంతో చెత్తడబ్బాలో గాలించగా సెల్‌ఫోన్ లభ్యమైంది. 
 
ఆ ఫోన్ పనిచేయకపోవడంతో దానిని చెత్తడబ్బాలో పడేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాంబు లేదని తెలియడంతో మెట్రో సిబ్బంది, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.