శుక్రవారం, 11 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (16:58 IST)

నటుడు ప్రకాశ్‌రాజ్‌కు గాయాలు-హైదరాబాద్‌‌లో సర్జరీ

నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రమాదానికి గురయ్యారు. ధనుష్‌ హీరోగా నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.

అయిత కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా ప్రకాశ్‌రాజ్‌ ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు చేతితోపాటు పలు చోట్ల బలమైన గాయాలయ్యాయని సమాచారం. 
 
మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో ఆయనకు సర్జరీ జరగనుందని తెలిసింది. అయితే దీనిపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఇది చిన్న ఫ్రాక్చర్ అని హైదరాబాద్ కు సర్జరీ కోసం వెళ్తున్నట్టు చెప్పారు. ఎవరూ ఆందోళన పడొద్దు అని అన్నారు.