సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (17:20 IST)

నా మాట‌ల్తో ఉద్యోగం వ‌దిలాడు. నాకే గిల్టీగా అనిపించింది

bommala koluvu trailer function
‘‘సినిమా అంటే త‌ప‌న ఉండి, అమెరికాలో నన్ను కలిసిన వాళ్లలో సుబ్బు ఒకడు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు మ‌రొక‌రు. త‌న‌ని నేను తీసిన గీతాంజ‌లి సినిమాతో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. అమెరికాలో ఓ బ్యాంకుకి వైస్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేస్తున్న రోజుల్లో నేను నీలో టాలెంట్ ఉందంటూ చెప్పిన కొన్ని స్పూర్తిదాయ‌క‌మైన మాట‌ల వ‌ల్ల‌, త‌ను అమెరికా నుంచి వ‌చ్చేసి నాకు షాకిచ్చాడు. ఉద్యోగం వ‌దిలేశాడు. నాకే కాస్త గిల్టీగా అనిపించింది. కొన్నిరోజుల‌కు త‌ను రాహు అనే సినిమా చేశాడు. అత‌నిలోని ఫైర్ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని తెలుసు. త‌ను అనుకున్నది సాధించాడు. ఇప్పుడు నాకు కాస్త ధైర్యంగా ఉంది. త‌ను ఈ బొమ్మ‌ల కొలువు నుంచి ముందుకు వెళ్లాల‌ని కోరుకుంట‌న్నాను. రిషికేశ్‌కు అభినంద‌న‌లు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సినిమాలు ఎలా బ‌య‌ట‌కు వ‌స్తాయో చెప్ప‌లేక‌పోతున్నాం. ఏదో ఒక మార్గంలో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని భావిస్తున్నాను. అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు కోన వెంక‌ట్.
 
సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన మ్యూజిక్ కంపోజర్ అనిరుద్‌ రవిచంద్రన్ కజిన్ రిషికేశ్. ‘రఘువరన్ బి.టెక్‌’తో సినీ ఇండస్ట్రీ లో అరంగేట్రం చేశారు. ఆ సినిమాలో ధ‌నుశ్ త‌మ్ముడి గా న‌టించిన రిషికేశ్ ఇప్పుడు ‘బొమ్మల కొలువు’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. రిషికేశ్‌, ప్రియాంక శ‌ర్మ‌, మాళ‌వికా స‌తీశ‌న్ హీరో హీరోయిన్లుగా సుబ్బు వేదుల ద‌ర్శ‌క‌త్వంలో పృథ్వీ క్రియేష‌న్స్‌, కిక్కాస్ స్టోరీ టెల్ల‌ర్ పతాకాల‌పై ఎ.వి.ఆర్‌.స్వామి నిర్మిస్తోన్న చిత్రం ‘బొమ్మ‌ల కొలువు’. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కోన వెంక‌ట్, బి.వి.ఎస్‌.ర‌వి ముఖ్య అతిథులుగా హాజ‌రై ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా హీరో రిషికేశ్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు సుబ్బు డిఫరెంట్‌గా తెర‌కెక్కించారు. నాపై న‌మ్మ‌కంతో రుద్ర అనే పాత్ర‌ను నాకు ఇచ్చారు. అలాగే నిర్మాత స్వామిగారికి స్పెష‌ల్ థాంక్స్‌. సినిమాలంటే ఉండే ప్యాష‌న్‌తో సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.
 
నిర్మాత ఎ.వి.ఆర్‌.స్వామి మాట్లాడుతూ ‘‘పాండమిక్ సమయంలో ఖాళీగా ఉన్న స‌మ‌యంలో సినిమాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అప్పుడు నాతో `రాహు` సినిమా చేసిన సుబ్బుతో మాట్లాడితే, ఆయ‌న సినిమా చేయ‌డానికి రెడీ అన్నారు. అలా ఈ బొమ్మ‌ల కొలువు సినిమా స్టార్ట్ అయ్యింది. దాంతో పాటు మ‌ల్లాద్రి అప్ప‌న్న ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, భానుశ‌ర్మ‌ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను, ఈ సినిమాల‌ను ఓకేసారి పూర్తి చేశాం. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే డిఫ‌రెంట్ మూవీ. క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంది. ఈ నెల‌లోనే ఈ మూడు సినిమాల‌ను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.
 
ద‌ర్శ‌కుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ ‘‘పదేళ్ల ముందు నుంచి నాకు కోన వెంకట్‌, బి.వి.ఎస్‌.ర‌విగారితో మంచి అనుబంధం ఉంది. రాహు త‌ర్వాత స్వామిగారితో సినిమా చేశాను. ఆయ‌న‌కు థాంక్స్. త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు.