సంబంధిత వార్తలు
- రికార్డు స్థాయిలో వృద్ధి చెందిన స్టాక్ మార్కెట్లు.. పదేళ్ల తర్వాత అదుర్స్
- వాట్సాప్‌లో కొత్త అప్డేట్.. స్టేటస్‌ను ఇక పూర్తిగా దాచేయవచ్చు..
- ఆర్టికల్ 370 : కేంద్రానికి సుప్రీం షాక్.... జమ్మూకాశ్మీర్‌కు చీఫ్ జస్టీస్
- పాపికొండ టూర్లో విషాదం... మృతులు ఎంతమందో తెలుసా?.. కారణమిదే...
- 'సైరా'లో ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా అనుష్క...
అనుష్క నిశ్శబ్ధం ఎంతవరకు వచ్చింది.?
అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి... ఇలా విభిన్న కథా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించిన అందాల తార అనుష్క. ఆమె నటించిన తాజా చిత్రం నిశ్శబ్ధం. ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
ఇటీవల రిలీజ్ చేసిన నిశ్శబ్ధం ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది. ఈ సినిమా చిత్రీకరణ మొత్తం అమెరికాలోనే జరిగింది. ఈ సినిమాలో ఆమె మ్యూట్ ఆర్టిస్ట్‌గా కనిపించనుంది. ఓ కీలకమైన పాత్రలో మాధవన్ నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో హాలీవుడ్ నటుడు మైఖేల్ కనిపించనున్నాడు.
ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో డబ్బింగ్ వర్క్ జరుపుకుంటోంది. దసరా పండుగకి ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్‌లో రిలీజ్ చేయనున్నట్టు తెలిసింది.
తర్వాతి కథనం
