గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 28 సెప్టెంబరు 2019 (21:45 IST)

బాల‌య్య మూవీ టీజ‌ర్ వ‌చ్చేస్తుంది... ఇంత‌కీ ఎప్పుడు..?

నంద‌మూరి న‌ట సింహం బాలకృష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాకి కె.ఎస్. ర‌వి కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సి.కె. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పైన సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిఫరెంట్ లుక్‌తో బాలకృష్ణ కనిపించే ఈ సినిమా, ఇప్పటికి కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. 
 
అక్టోబ‌ర్ 5 నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ చేయ‌నున్నారు. ఇందులో బాల‌య్య స‌ర‌స‌న సోనాల్ చౌహాన్ - వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. అక్టోబ‌ర్ 5 నుంచి ప్రారంభమ‌య్యే తాజా షెడ్యూల్లో బాలకృష్ణతో పాటు ప్రధాన పాత్రధారులు అంద‌రూ పాల్గొంటారు. ప్రకాష్‌ రాజ్, జయసుధ, భూమిక పాత్రలు ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు.
 
గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రానికి సంగీతం అందించిన‌ చిరంతన్ భట్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. చిరంత‌న్ అందించే సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంద‌ని తెలిసింది. ఈ మూవీ టీజ‌ర్‌ను దసరా కానుకగా రిలీజ్ చేయ‌నున్నారు.