భారీ యాక్షన్ మూవీగా గోపీచంద్ 'చాణక్య' (Teaser)
గోపీచంద్ తాజా చిత్రం చాణక్య. భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ సోమవారం సాయంత్రం విడుదలైంది. ఈ చిత్రంలో గోపీచంద్ రా ఏజెంట్‌గా పని చేస్తున్నారు. 'తిరు' దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకురానుంది. తీవ్రవాదానికి .. దేశభక్తికి సంబంధించిన విజువల్స్‌పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో గోపీచంద్ జోడీగా మెహ్రీన్, జరీన్ ఖాన్ కనిపించనున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో, జరీన్ ఖాన్ కీలకమైన పాత్రలో కనిపించనుంది. కొంతకాలంగా సక్సెస్ కోసం గోపీచంద్ చేస్తోన్న నిరీక్షణ ఈ సినిమాతో ఫలిస్తుందేమో చూడాలి.