గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : గురువారం, 30 మే 2019 (15:12 IST)

రష్మిక ప్లేస్‌లోకి మెహ్రీన్.. నాగశౌర్యతో హనీ ఈజ్ ద బెస్ట్

అందాల కథానాయిక మెహ్రీన్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుంచి మంచి ఫామ్‌లో ఉంది, న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీరప్రేమ గాథ సినిమాతో లైవ్ లైన్‌లోకి వచ్చిన ఈ భామ, ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో వరుసపెట్టి అవకాశాలు దక్కించుకుంది.


ఇలా రవితేజ, సాయి ధరమ్ తేజ్, గోపీచంద్, శర్వానంద్, వరుణ్ తేజ్ వంటి యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేసిన మెహ్రిన్, ఆ త‌ర్వాత నటించిన సినిమాలు వ‌రుసగా ప్లాపులు అవడంతో టాలీవుడ్ ఐరెన్‌లెగ్ హీరోయిన్ అన్న ముద్ర కూడా వేయించుకుంది. 
 
అప్పటి నుండి స్టార్ హీరోల సినిమాల్లో మెహ్రీన్‌కు ఛాన్సులు రావ‌డం పెద్ద క‌ల‌గా మారిపోయింది. ఈ ఏడాది ఆరంభంలో వెంకీ, వ‌రుణ్ తేజ్ మ‌ల్టీస్టార‌ర్ కాంబినేషన్‌లో వ‌చ్చిన ఎఫ్ -2 సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో మెహ్రీన్‌కు క్రేజ్ వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఎఫ్‌-2 హిట్ అయినా మెహ్రీన్ ద‌శ మార‌లేదు. గోపీచంద్ సరసన ఒక సినిమా, నాగ శౌర్య సరసన ఐరా క్రియేషన్స్‌లో మరో సినిమాలో మెహ్రీన్ నటిస్తోంది. కానీ ఎఫ్ 2 పుణ్య‌మా అని ఆమె రేటు మాత్రం పెంచేసింది. ఇంత‌కు ముందు వ‌ర‌కు సినిమాకు 50 ల‌క్ష‌లు డిమాండ్ చేసే ఆమె ఇప్పుడు మ‌రో 30 ల‌క్ష‌లు పెంచి మొత్తం 80 ల‌క్ష‌లు డిమాండ్ చేస్తోంద‌ట‌. 
 
నాగ‌శౌర్య సినిమాలో ముందుగా ర‌ష్మిక మంద‌న్నాను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకున్నారు, అయితే ఆమె వ‌రుస పెట్టి టాప్ హీరోల‌తో ఛాన్సులు కొట్టేస్తోంది. మ‌హేష్ ప‌క్క‌న కూడా ఆమెకు ఛాన్స్ వ‌చ్చింది. అలాగే పారితోష‌ికం స‌రిపోకపోవడం వల్ల ఏమో గాని ఆమె నాగ‌శౌర్య సినిమాకు నో చెప్పింది. దీంతో రష్మిక ప్లేస్‌లోకి మెహ్రీన్ వచ్చి చేరింది. అయితే ఇప్పటివరకు పారితోషికం కింద రూ.50 లక్షలు మాత్రమే అందుకుంటున్న మెహ్రీన్ నాగశౌర్య సినిమాకు 80 ల‌క్ష‌లు డిమాండ్ చేసి మ‌రీ వ‌సూలు చేస్తోంద‌ట‌.