సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 20 జూన్ 2019 (19:36 IST)

మెహరీన్ అలా చేసి ఛాన్సులు కొట్టేస్తోందట...?

తెలుగు సినీపరిశ్రమలో అనతికాలంలోనే టాప్ టెన్ హీరోయిన్ల జాబితాలో చేరింది మెహరీన్. మొదట్లో వరుసగా విజయాలు వరించినా ఆ తరవాత వరుస పరాజయాలు తప్పలేదు. దానికి తోడు మెహరీన్ బొద్దుగా తయారైంది అంటూ తెలుగు సినీపరిశ్రమలో టాక్. ఇక ఛాన్సులు రావడం తగ్గిపోయింది. దీంతో మెహరీన్ ఆలోచనలో పడింది.
 
సినిమా అవకాశాలు రావాలంటే స్లిమ్‌గా అవ్వాలి అని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా బాగా స్లిమ్ అయ్యింది. ఇంకేముంది ఆ తరువాత ఎఫ్‌-2లో నటించింది. ఆ సినిమా కాస్త భారీ విజయాన్ని సాధించింది. మెహరీన్‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇంకేముంది మళ్ళీ మెహరీన్ ఫాంలోకి వచ్చేసిందనుకున్నారు అందరూ.
 
అనుకున్నట్లే వరుసగా సినిమాలు రావడం ప్రారంభమయ్యాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మెహరీన్‌కు అవకాశాలు వరుసపెట్టాయి. తెలుగులో చాణక్య సినిమాలో గోపీచంద్‌తో నటిస్తుండగా, కళ్యాణ్‌ రామ్‌తో మరో సినిమా ఒకే చేసేసింది. ఆ తరువాత తమిళంలో ఒక సినిమా, హిందీలో మరో సినిమాకు సంతకం చేసేసింది. ఇలా వరుసగా ఛాన్సులు రావడంతో మెహరీన్ సమయం లేకుండా గడుపుతోందట.