గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (18:46 IST)

మెహ్రీన్‌కి ఏమైంది.. సినిమా ఛాన్సుల్లేవా..?

నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్, ఆ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. మెహ్రీన్ వెంటనే మహానుభావుడు సినిమాలో నటించింది. ఆ చిత్రం కూడా విజయం సాధించింది. వెంటవెంటనే రెండు హిట్స్ రావడంతో అమ్మడుకి వరుస ఆఫర్లు వచ్చాయి. 
 
ఆ తర్వాత వచ్చిన నాలుగు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమె కెరీర్ కష్టాల్లో పడింది. ఆ సమయంలో రవితేజతో కలిసి నటించిన రాజా ది గ్రేట్ చిత్రం కమర్షియల్‌గా సక్సెస్ కావడంతో పాటు నటిగా మంచి మార్కులు కొట్టేసింది మెహ్రీన్. ఈ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి తన ఎఫ్ 2లో మరో అవకాశం ఇచ్చాడు. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఇది బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. 
 
వరుసగా రెండు హిట్‌లు రావడంతో మళ్లీ ఆఫర్లు వెల్లువలా వస్తాయని అనుకున్నప్పటికీ, ఆమె మరో చిత్రానికి సైన్ చేయలేదు. అందుకు గల కారణాలు తెలియరాలేదు. ఒకవేళ హీరోయిన్‌లకు టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు లేకపోతే పక్క ఇండస్ట్రీలపై తమ దృష్టి సారిస్తారు. మెహ్రీన్ ఆ పని కూడా చేయడం లేదు. అటు సినిమాలు లేక ఆమె ఏమి చేస్తుందోనని సినీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది.