శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 11 మార్చి 2019 (20:15 IST)

వామ్మో... ఆ హీరోనా.. నేను నటించనంటున్న మెహరీన్.. ఏమైంది?

హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ ఎఫ్‌-2 సినిమాతో అందరినీ ఆకట్టుకుంది హీరోయిన్ మెహరీన్. అంతకుముందు ఎన్నో సినిమాల్లో ఆమె నటించినా ఎఫ్‌-2 సినిమాకు వచ్చినంత పేరు మరే సినిమాకు రాలేదు. అయితే ఆ సినిమాలో హీరో వరుణ్ తేజ్‌తో కలిసి జతకట్టింది మెహరీన్. సినిమా షూటింగ్ సమయంలో హీరో కారణంగా బాగా ఇబ్బంది పడిందట మెహరీన్.
 
కారణం వరుణ్‌ తేజ్ ఆరడుగుల రెండు అంగుళాలు ఉండటంతో మెహరీన్‌కు ఇబ్బందులు తప్పలేదట. వరుణ్‌ పక్కన మెహరీన్ చాలా పొట్టిగా కనిపిస్తోందట. దీంతో ఏం చేయాలో పాలుపోక మెహరీన్ వచ్చే సినిమాలో అతని పక్క నటించకూడదన్న నిర్ణయానికి వచ్చేసిందట. వరుణ్‌ లాంటి హీరో పక్కన ఉంటే మెహరీన్ పొట్టిగా కనిపించడంతో ఆమె అభిమానులు నిరుత్సాహపడుతున్నారట. దీంతో ఈ నిర్ణయం మెహరీన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.