శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:34 IST)

నాగబాబు అన్నయ్య లాంటి వారు.. అరేయ్, ఒరేయ్ అంటారు..

మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో పాటు మెగా బ్రదర్ నాగ‌బాబు ఎక్క‌డి నుంచో తెచ్చిన డ‌బ్బుల‌ను జ‌న‌సేన పార్టీకి విరాళం ఇచ్చార‌ని నోరు జారాడు పృథ్వీ. ఈ కామెంట్స్‌పై నాగ‌బాబు చాలా సీరియ‌స్ అయ్యాడు. ప్రస్తుతం నాగబాబు వ్యాఖ్యలపై స్పందించాడు. తనకు నాగబాబు అన్నయ్య లాంటి వారన్నాడు. ఆయనతో తనకు చనువు వుంది కాబట్టే అరేయ్ అన్నాడని పృథ్వీ చెప్పుకొచ్చాడు.
 
దానికితోడు ఒక‌సారి నేరుగా క‌లిసి మాట్లాడితే అన్ని స‌మ‌స్య‌లు తీరిపోతాయ‌ని పృథ్వీ చెప్పాడు. అలాగే కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల దృష్ట్యా నాగార్జున వ‌చ్చి వైకాపా చీఫ్ జ‌గ‌న్‌ను క‌లిసారే కానీ రాజ‌కీయ కార‌ణాలు లేవ‌ని పృథ్వీ చెప్పుకొచ్చాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే జగన్ ని ఆయన కలిశారని అన్నారు. 
 
అలాగే మెగా కుటుంబంతో తనకు మంచి అనుబంధం వుందని.. అందుచేత వాళ్లు ఏమన్నా పట్టించుకునే ప్రసక్తే లేదని పృథ్వీ చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌రుగుతున్న తీరుపై ఓ నాట‌కం వేస్తున్నామ‌ని చెప్పాడు పృథ్వీ. ఈ మ‌ధ్య వైసిపి రాష్ట్ర సెక్ర‌ట‌రీగా పృథ్వీ ఎంపికైన సంగతి తెలిసిందే.