శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (14:17 IST)

జనసేన ఓడిపోయే పార్టీ.. అడ్రెస్ లేని పార్టీ అనమంటావా? బాబూ మోహన్

జనసేన. ఏపీలో వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయబోతున్న పార్టీ. ఈ నేపధ్యంలో ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన ఏ నటుడు లేదా నటిని ఇంటర్వ్యూ చేసినా జనసేన పార్టీ గురించి అడుగుతున్నారు. తాజాగా ప్రముఖ కామెడీ నటుడు బాబూ మోహన్‌ను కూడా జనసేన గురించి, పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశం గురించి అడిగారు. 
 
బాబూ మోహన్ ఆ ప్రశ్నకు స్పందిస్తూ.. జనసేన ఓడిపోయే పార్టీ.. అడ్రెస్ లేని పార్టీ అనమంటావా? ఈరోజుల్లో గోచీ లేనోళ్లే పార్టీలు పెడుతున్నారు. అడ్రెస్ లేని వ్యక్తులు రాజకీయ పార్టీలు పెడుతున్నారు. పవన్ కల్యాణ్ గారికేమిటి... ఆయన ఓ మెగాస్టార్ తమ్ముడు. ఒక సినిమాకు కోట్ల రూపాయలు వస్తున్నాయి. సక్సెస్‌లో వుండగానే ఇండస్ట్రీని వదిలిపెట్టి రాజయాల్లోకి వెళ్లారు. ఎందుకు? ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో. 
 
డబ్బే ధ్యేయమైతే సినిమా ఇండస్ట్రీలోనే హాయిగా వుండొచ్చుగా. రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి ఎందుకు వెళ్లారో ఆయనను చూస్తే తెలుస్తుంది. ఎవరైనా సినిమా సక్సెస్ కావాలనే తీస్తారు. అలాగే ఏ రాజకీయ పార్టీ పెట్టినవారైనా తమ పార్టీ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుని పాలనా పగ్గాలు చేపడుతుందని అనకుంటారు.