కేసీఆర్ ఏపీకి రూ. 5 వేల కోట్లివ్వాలి.. అడిగితే బెదిరిస్తున్నారు... బాబు సంచలనం
ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వంపైన గురిపెట్టిన చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా తెలంగాణ సీఎం కేసీఆర్ పైకి ఎక్కుపెట్టారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ. 5 వేల కోట్లు ఇవ్వకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేసీఆర్ రూ. 5 వేల కోట్లు బాకీపడ్డారని ఆరోపించిన చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఏపీ కరెంట్ వినియోగించుకుని డబ్బులు అడుగుతుంటే ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. దీని గురించి మాట్లాడినా ఆయన వెంటనే తెలంగాణ ఫీలింగ్ తెస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసింది తానేనని మరోసారి అన్నారు.