సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (11:08 IST)

సంక్రాంతి అల్లుడితో ఈషా రెబ్బా.. ఇరగదీయడం ఖాయమా?

ఎఫ్-2 సినిమా తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే సినిమా చేస్తున్నాడు. తమిళంలో భారీ హిట్ కొట్టిన జిగిర్తాండ సినిమాకు ఇది రీమేక్. తమిళంలో బాబీసింహా చేసిన పాత్ర కోసం వరుణ్ తేజ్ ఎంపికయ్యాడు. ఇక సిద్ధార్థ్ చేసిన పాత్రకు గాను శ్రీ విష్ణువును తీసుకున్నాడు. 
 
కథానాయికగా రష్మిక మందన పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈషా రెబ్బా పేరు తెరపైకి వచ్చింది. బిజీ షెడ్యూల్ కారణంగా రష్మిక వరుణ్ తేజ్ సినిమాలో నటించే అవకాశాలు తక్కువగా వున్నాయని.. ఈషా రెబ్బ ఈ సినిమాకు ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్సుందని సినీ జనం అనుకుంటున్నారు. మరి ఈషా రెబ్బా, రష్మిక మందనల్లో ఎవరు వరుణ్ తేజ్ సరసన నటిస్తారనేది వేచి చూడాలి.