హనీకి కోపం తెప్పించిన దిల్ రాజు.. ఎందుకు?

Mehreen
జె| Last Modified శనివారం, 2 ఫిబ్రవరి 2019 (18:58 IST)
హనీ ఈజ్ ద బెస్ట్.. ఈ డైలాగ్ వినగానే వెంటనే ఎఫ్-2 సినిమా అందులోని మెహరీన్ క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది కదా. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో అందరికీ తెలుసు. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఇప్పటికీ భారీ టాక్‌తో భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

సినిమా భారీ విజయం తరువాత ఎఫ్‌-3 సినిమా కూడా తీయాలన్న నిర్ణయానికి వచ్చారు దర్శకుడు అనిల్
రావిపూడి, నిర్మాత దిల్ రాజు.. ఎఫ్‌-2లో నటించిన తారాగణాన్నే తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారట దిల్ రాజు. అయితే ఎఫ్‌-2 సినిమాలో ఇచ్చిన డబ్బుల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్‌ను ఎఫ్‌-3కి అడుగుతున్నారట.

అందరూ ఒక ఎత్తయితే ఇందులో మెహరీన్ కాస్త ఎక్కువగా రెమ్యునరేషన్ అడుగుతోందట. దీనికి దిల్ రాజు ఒప్పుకోవడం లేదట. దీంతో మెహరీన్‌కు కోపం వచ్చి అడిగిన డబ్బులు ఇస్తేనే ఎఫ్‌-3లో నటిస్తానని తేల్చి చెబుతోందట. ఇంకా సెట్స్ మీదకు సినిమా వెళ్ళలేదు కాబట్టి దిల్ రాజు కూడా మెహరీన్ కోపాన్ని లైట్ తీసుకున్నాడట.దీనిపై మరింత చదవండి :