సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (17:35 IST)

వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్.. స్టేటస్‌ను ఇక పూర్తిగా దాచేయవచ్చు..

సోషల్ మీడియా అగ్రగామి అయిన వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్ వచ్చేసింది. ఇకపై వాట్సాప్‌లో మ్యూట్ చేసిన స్టేటస్ అప్‌డేట్‌లను పూర్తిగా దాచేందుకు వీలుగా కొత్త ఫీచర్ రానుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ శాతం ప్రజలు వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. తమ వినియోగదారులను పెంచుకునే రీతిలో వాట్సాప్‌లో కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది... ఫేస్‌బుక్ సంస్థ. 
 
ఈ క్రమంలో వాట్సాప్‌ యాప్‌లో మ్యూట్ చేయబడిన స్టేటస్‌ను ఇకపై పూర్తిగా దాచే ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. గత కొద్ది నెలల పాటు ఈ కొత్త అప్‌డేట్‌కు సంబంధించిన పరిశోధన జరుగుతూ వచ్చింది. త్వరలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. 
 
వాట్సాప్ అధునాతన బీటా వెర్షన్‌లో అందించే ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో వుంటుంది. తద్వారా ఇకపై మ్యూట్ చేయబడిన నెంబర్లను సులభంగా కనుగొనే ఛాన్స్ వుంటుంది.