శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (12:08 IST)

ఆడియో మెసేజ్ కోసం వాట్సాప్ కొత్త ఫీచర్.. ప్రివ్యూ చూసుకోవచ్చట..

సోషల్ మీడియా అగ్రగామి అయిన వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్ రానుంది. ఇప్పటికే పలు రకాల అప్ డేట్స్‌ను విడుదల చేసిన సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తాజాగా కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇందులో భాగంగా రికార్డింగ్‌ను పరిశీలించి, సరిచేసుకునే అవకాశం కల్పించనుంది. 
 
సాధారణంగా వాట్స్‌యాప్‌లో వీడియో అయినా, టెక్ట్స్ మెసేజ్ అయినా, ఫార్వార్డ్ చేసే ముందు పరిశీలించుకునే అవకాశం ఉంది. కానీ, షార్ట్ ఆడియో క్లిప్ రికార్డ్ చేసి వదలగానే అది వెళ్లిపోతుంది. దాన్ని పరిశీలించే అవకాశం ఉండదు.
 
ఈ ఫీచర్ ద్వారా వాయిస్ కూడా సరిచేసుకుని పంపుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్‌లో బీటా దశలో వుందని.. అతి త్వరలో అందరు యూజర్లకు అందుబాటులోకి రానుందని వాట్సాప్ ప్రకటించింది.