శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 3 జులై 2019 (13:09 IST)

మానసిక ఒత్తిడికి చెక్ పెట్టే వాట్సాప్.. రిపోర్ట్‌లో వెల్లడి.. నెటిజన్లు హ్యాపీ

టెక్నాలజీ ఏ మేరకు అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌లోనే ప్రపంచమే చేతుల్లో వుండే భావన కలుగుతుంది. సోషల్ మీడియా ద్వారా ఎంత చిన్న విషయం జరిగినా ప్రపంచానికి తెలిసిపోతుంది. వీటిల్లో ముఖ్యంగా వాట్సాప్‌ను ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. 
 
సోషల్ మీడియా ద్వారా మంచి కొంతమేరకే జరుగుతుందని.. నష్టాలే ఎక్కువగా జరుగుతున్నాయని టాక్ వచ్చిన నేపథ్యంలో.. తాజాగా వాట్సాప్‌కు సంబంధించిన సర్వే రిపోర్ట్.. నెటిజన్లను ఖుషీ ఖుషీ చేస్తోంది. అదేంటంటే? వాట్సాప్‌ను ఉపయోగించే వారిలో మానసిక ఒత్తిడి పారిపోతుందట.

వాట్సాప్ యాప్ ద్వారా మానసిక రుగ్మతలు తొలగిపోతున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. దీంతో నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. 
 
ఉదయం పూట నిద్రలేచిన వెంటనే నెట్‌ను ఆన్ చేసి స్నేహితులకు, బంధువులకు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పడం ద్వారా ఉత్సాహంగా వుండగలుగుతామని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. ఇంకా వాట్సాప్‌లో గ్రూప్ చాటింగ్, వ్యక్తిగత చాటింగ్ వుండటంతో మానసిక ఒత్తిడి వుండదట.

దీంతో మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి వంటివి వుండవని.. మానసిక ఉల్లాసం ఏర్పడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అధిక సమయం వాట్సాప్‌లో గడిపితే కూడా ఎలాంటి ఇబ్బందులు వుండవని.. ఆరోగ్య సమస్యలు అస్సలు వుండవని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది.