వాట్సాప్‌లో హద్దు మీరిన భార్య.. ఉరేసుకున్న భర్త.. కుమారుడికి విషమిచ్చి?

whatsApp
Last Updated: శుక్రవారం, 7 జూన్ 2019 (19:18 IST)
సోషల్ మీడియా ప్రభావంతో ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని పక్కనబెడితే.. సామాజిక ప్రసార మాధ్యమాల వల్ల మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో హద్దుమీరిన కారణంగా మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని కోవైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోవై, శరవణంపట్టికి చెందిన అర్జున్ (46) టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య అలమేలు (40) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ దంపతులకు ఓ కుమారుడు వున్నాడు. ఇతడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం పని ముగించుకుని ఇంటికి చేరుకున్న అలమేలు.. ఇంటి లోపల లాక్ అయి వుండటం గమనించి కిటికీలను తెరిచి చూసింది. 
 
అంతే.. భర్త, కుమారుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం చూసి షాకైంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి మొత్తం తనిఖీలు చేశారు. ఇలా పోలీసులకు ఓ సూసైడ్ నోట్ దొరికింది. 
 
ఈ లేఖలో అలమేలు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం వుందని.. ఆమె వాట్సాప్‌లో హద్దుమీరిందని.. దీంతో మనస్తాపానికి గురైన తాను.. కుమారుడికి విషం ఇచ్చి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నానని రాశాడు. దీనిపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.దీనిపై మరింత చదవండి :