సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 7 జూన్ 2019 (15:16 IST)

ఆరేళ్ల బాలికపై 100 సార్లు అత్యాచారం... లైవ్ స్ట్రీమ్ ద్వారా షేరింగ్...

29 ఏళ్ల కామాంధుడు ఆరేళ్ల బాలికపై 100 సార్లు అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి పాల్పడటమే కాకుండా రేప్ చేసిన ప్రతిసారీ లైవ్ స్ట్రీమ్ చేశాడు. ఈ రాక్షసుడికి కోర్టు 120 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
 
వివరాల్లోకి వెళితే... బ్లూమ్‌ఫీల్డుకి చెందిన 29 ఏళ్ల స్టీవెన్ డగ్లస్ క్రూక్ ఆరేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. 
 
ఈ దారుణానికి ఒడిగట్టడమే కాకుండా ఆ పని చేసేటప్పుడు లైవ్ స్ట్రీమ్ చేసేవాడు. ఈ వీడియో స్ట్రీమ్ ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టేలోపు కట్ చేసేవాడు. ఐతే పోలీసులు వలపన్ని అతడిని గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. కేసు విచారించిన కోర్టు ఇతడికి 120 ఏళ్ల శిక్ష విధించింది.