భార్యతో సంబంధం పెట్టుకున్నాడనీ బండరాయితో మోది...

murder
Last Updated: శుక్రవారం, 7 జూన్ 2019 (11:30 IST)
కట్టుకున్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ భర్త నిగ్రహించులోక పోయాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని పట్టుకుని బండరాయితో మోది హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా రేకులబి తాండలో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ తాండాకు చెందిన బానోతు రాము (28) నగరానికి వలస వచ్చి మణికొండలో నివసిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన రమేష్‌ - శాంతి అనే దంపతులు కూడా నివశిస్తున్నారు. ఈ క్రమంలో శాంతితో రాముకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

ఈ క్రమంలో గత మంగళవారం రాత్రి తన భార్యతో రాము అత్యంత సన్నిహితంగా ఉండటాన్ని రమేష్ గమనించి తట్టుకోలేక పోయాడు. వెంటనే తీవ్ర ఆగ్రహానిగురై కత్తితో రామును పొడిచి, ఆ తర్వాత బండరాయితో కొట్టి చంపేశాడు. ఈ వెంటనే రమేష్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రమేష్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :