శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (10:01 IST)

ప్రేమ పిచ్చోడు : ప్రియురాలు నో చెప్పిందనీ ఐటీ కంపెనీ ఎండీ సూసైడ్

ఇటీవలికాలంలో ప్రేమ విఫలం కారణంగా జరిగే ఆత్మహత్యల సంఖ్య ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ప్రేమికుల మధ్య మనస్పర్థలు రావడం, ప్రేమను నిరాకరించడం, తిరస్కరించడం వంటి సంఘటనలతో విసిగిపోయిన ప్రేమికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా ఓ ఐటీ కంపెనీ ఎండీ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలు ప్రేమను అంగీకరించలేదన్న కారణంతో ఆయన ఈ దారుణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నాచారం ప్రాంతానికి చెందిన నిఖిల్ రెడ్డి (27) అనే యువకుడు శ్రీ సాయితి టెక్ మల్టీనేషనల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టరుగా పని చేస్తున్నాడు. ఈయన అదే కంపెనీలో పని చేసే ఓ యువతిని గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో తన ప్రేమ, పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. కానీ, అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ యువతి పెళ్లికి మాత్రం నో చెప్పింది. 
 
దీంతో తవ్ర మనస్తాపానికి గురైన నిఖిల్ రెడ్డి తన చాంబర్‌లోనే ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. దీన్ని గమనించిన కంపెనీ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు పోయినట్టు వైద్యులు వెల్లడించారు. దీనిపై అమీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.