శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (12:11 IST)

ఢిల్లీ తరహాలో ఉచిత ప్రయాణం వద్దు.. రాయితీ ఇస్తే చాలు...

ఢిల్లీలో తరహాలో హైదరాబాద్ నగరంలో కూడా మెట్రో రైల్ జర్నీని ఉచితంగా కల్పించాలని మహిళలు కోరుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్ నగరంలో కూడా ఉచిత మెట్రో రైల్ సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నారు. అంతేకాకుండా, మెట్రో రైల్ చార్జీలు తగ్గించాలని వారు కోరుతున్నారు. 
 
ఢిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థలైన మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. త్వరలో అమల్లోకి తెస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఢిల్లీ తరహాలో తమకు ఉచిత ప్రయాణం అవసరం లేదని, సీజనల్‌ పాసులిస్తే చాలని నగర వాసులు చెబుతున్నారు. 
 
హైదరాబాద్‌ మహానగరానికి గర్వకారణంగా నిలిచిన మెట్రోరైలు ప్రాజెక్టు 2017లో నవంబర్‌ 29వ తేదీన ప్రారంభమైంది. అంతకు ముందే నుంచే ప్రజా రవాణా వ్యవస్థలైన ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌, మెట్రో రైలు వంటి రవాణా సాధనల్లో ప్రయాణించేందుకు వీలుగా ఉమ్మడి పాసులను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే పలుమార్లు చర్చలు, సమావేశాలు జరిపింది. రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఉమ్మడి పాసుల జారీ ప్రకటనలకే పరిమితమైంది.
 
హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం సుమారు 20వేల కోట్లు ఖర్చు చేశామని పదే పదే ప్రభుత్వం ప్రకటిస్తోంది. అలాంటి ప్రాజెక్టు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ, రైల్వేలకు రాయితీలు ఇస్తున్నట్లుగానే మెట్రోరైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కొంత మొత్తాన్నైనా కేటాయించి నగర అన్ని వర్గాలు మెట్రోలో ప్రయాణం చేసేలా చేయాలన్న డిమాండు ప్రస్తుతం పెరుగుతోంది.