గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 2 జూన్ 2019 (16:00 IST)

కాపురంలో జోక్యం చేసుకుంది.. అత్త నెంబర్‌ను అశ్లీల సైట్లో పెట్టేసిన అల్లుడు

కాపురంలో జోక్యం చేసుకున్న అత్తకు అల్లుడు షాకిచ్చాడు. పిల్లనిచ్చిన అత్త హితబోధలు చేయడం ఇష్టం లేని అతడు ఆమె ఫోన్‌ నెంబర్‌ను ఓ అశ్లీల సైట్లో పెట్టాడు. అమ్మాయిలు కావాలంటే.. ఈ నెంబర్‌కు ఫోన్ చేయండి అంటూ ఆ నెంబర్‌ను కనిపించేలా ఆ నెంబర్ వుంచాడు. ఇక అప్పటి నుంచి ఆమెకు విపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చేవి. 
 
అన్నీ కూడా అసభ్యకర మాటలు, జుగుప్సాకరమైన వర్ణనలతో కూడిన కాల్స్ కావడంతో ఆమె హడలిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన అత్తకు అల్లుడే నెంబర్‌ను అశ్లీల సైట్లో పెట్టాడని తెలిసింది. ఈ పరిణామంతో ఎంతో మనస్తాపం చెందింది. వికృత మనస్తత్వంతో దారుణంగా ప్రవర్తించిన సునీల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కినెట్టారు.
 
ఈ వ్యవహారమంతా విశాఖపట్నం ఎన్టీపీసీలో చోటుచేసుకుంది. సునీల్ అనే యువకుడు హైదరాబాదుకు చెందిన యువతితో పెళ్లి అయ్యింది. వీరి కాపురంలో గొడవులు మొదలయ్యాయి. దాంతో సునీల్ భార్య తన బాధను తల్లితో మొరపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆమె వచ్చి సునీల్‌కు సర్దిచెబుతుండేది. ఇది నచ్చకే సునీల్ అత్త ఫోన్‌ నెంబర్‌ను అశ్లీల సైట్‌లో అప్‌లోడ్ చేశాడు.