శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 2 జూన్ 2019 (15:18 IST)

సీఎంల భజన.. పండుగలు చేసుకోవడమే గవర్నర్ పని.. వీహెచ్ ఫైర్

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ని తప్పించకపోతే రాష్ట్రం బాగుపడదు. సీఎంల భజన చేయడం, పండుగల చేసుకోవడం తప్పితే గవర్నర్‌ ఇంకేం చేయడం లేదని వీహెచ్ మండిపడ్డారు.


ఉమ్మడి రాష్ట్రాలకు ఇలాంటి గవర్నర్ తమకు అక్కర్లేదని.. ఇలాంటి గవర్నర్‌ని తన జీవితంలో చూడలేదన్నారు. తెలంగాణకు సంబంధించి ఏ విషయాన్నీ ఆయన పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 
 
ఆదివారం గాంధీభవన్‌లో ఆయన విలేఖరులతో వీహెచ్ మాట్లాడుతూ.. గవర్నర్ ఏ విషయాన్ని పట్టించుకోవట్లేదు. రైతులకు బేడీలు వేస్తే పట్టించుకోరు. నెరేళ్ల బాధితుల విషయంలో చర్యలు లేవు. అంబేద్కర్ విగ్రహం కూల్చినా పట్టించుకోరు. హజీపూర్‌లో హత్యలపై పట్టించుకోరు. ఇంటర్ పిల్లల ఆత్మహత్యలపై చర్యలు తీసుకోరంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అయినా చొరవ తీసుకుని గవర్నర్‌ని తప్పించాలని కోరారు. గవర్నర్‌ని తప్పించాలని అమిత్‌ షాకి లేఖ రాస్తానని చెప్పారు.