శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (17:32 IST)

రాజకీయాలంటే భార్య విడాకులు ఇస్తుంది: మాజీ ఆర్బీఐ గవర్నర్

గతంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పని చేసి, తాను తీసుకున్న సంచలన నిర్ణయాలతో సుపరిచితుడైన రఘురామ్ రాజన్ రాజకీయాల్లోకి వచ్చే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
తాను కుటుంబంతో జీవితాన్ని గడిపేందుకు నిర్ణయించుకున్నానని, అలాగే రాజకీయాల్లోకి వెళ్లొద్దని తన భార్య తనను కోరిందని, ఒకవేళ తన మాట వినకుండా రాజకీయాల్లోకి వెళ్తే తనను వదిలేస్తానని భార్య తెగేసి చెప్పినట్లు రఘురామ్ రాజన్ చెప్పుకొచ్చారు. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, ప్రస్తుతం ఆధ్యాపకుడిగా పనిచేయడం సంతృప్తినిస్తున్నట్లు పేర్కొన్నారు.
 
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం(న్యాయ్)తో కొంతమేర ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉందని, పేదలకు నగదును అందించడం ద్వారా వారికి అవసరమైన నిత్యవసరాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం రఘరామ్ రాజన్ అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయంలో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.