గవర్నర్‌గా నరసింహన్ సరికొత్త రికార్డు.. ఏంటది?
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. గత 2009 నుంచి గవర్నర్‌గా ఉన్న ఈయన హయాంలో ఇప్పటికే నాలుగు ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 30వ తేదీన ఐదో ప్రభుత్వం ఏర్పాటుకానుంది.
గత 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ఈఎస్ఎల్ నరసింహన్ నియమితులయ్యారు. ఆ తర్వాత 2010లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ పిమ్మట 2014లో నవ్యాంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుతో ప్రమాణం చేయించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌తో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత 2018 డిసెంబరు నెలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికా కేసీఆర్ రెండోసారి ప్రమాణం చేయించారు. ఈయనతోనూ నరసింహన్ ప్రమాణం చేయించారు.
ఇపుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డితో ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. ఈ నెల 30వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో జగన్‌తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ వైకాపా ప్రభుత్వంతో కలిపి మొత్తం ఐదు ప్రభుత్వాలు గవర్నర్ హయాంలో ఏర్పడినట్టుగా చెప్పొచ్చు.