గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (10:54 IST)

కాలిఫోర్నియా గవర్నర్ సంచలన నిర్ణయం.. 737 మంది మరణశిక్షలు రద్దు

అమాయకులు బలైపోకూడదనే ఉద్దేశంతో కాలిఫోర్నియా గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరణశిక్షలను నిలిపివేస్తున్నానని కీలక ప్రకటన చేసారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఈ ప్రకటన చేయడంతో దేశంలో చర్చ మొదలైంది. ఒక్కసారిగా 737 మంది నేరస్థులను మరణ శిక్ష నుండి తప్పించారు. 
 
తోటి మనిషిని చంపే హక్కు మనకు ఎవరు ఇచ్చారు?, శిక్ష పడిన వారిలో ఎంతో మంది అమాయకులు ఉంటారు. పొరపాటున కూడా వారిని చంపకూడదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు మరణ శిక్షను రద్దు చేసి నేరస్థుల ప్రవర్తనలో మార్పు తేవాలని ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఈ నిర్ణయం పట్ల ప్రపంచ వ్యాప్తంగా మానవతావాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గవిన్ నిర్ణయాన్ని ఆ దేశ ప్రజలంతా ఆహ్వానించారు. వారి ప్రవర్తనలో మార్పులు తేవడానికి చర్యలు తీసుకుంటామని, దీని వల్ల వారికి ఓ కొత్త జన్మ ప్రసాదించినట్లవుతుందని స్పష్టం చేసారు.