పెళ్లి గురించి తమన్నా... మంచి అబ్బాయిని చూడమన్నాను..

Last Updated: ఆదివారం, 2 జూన్ 2019 (15:36 IST)
తెల్లపిల్ల తమ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 సంవత్సరాలైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా.


ఇటీవల తమన్నా ఫోటో షూట్ నెట్టింట వైరల్ అయ్యింది. ఆమె నటించిన తాజా చిత్రం 'అభినేత్రి 2' తెలుగు, తమిళ భాషల్లో గత శుక్రవారమే విడుదలైంది. 
 
తమన్నా తెలుగు, తమిళ పరిశ్రమల్లో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిలో తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. యువరాణిగా తమన్నా ఇందులో కనువిందు చేయనుందని టాక్ వస్తోంది.  
 
ఇకపోతే.. ప్రమోషన్‌లో పాల్గొన్న తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఇప్పటికే 29 ఏళ్ల పడిలో తమన్నా.. తాను పెళ్లికి సిద్ధంగా వున్నానని.. అంతేగాకుండా తమ చిత్ర దర్శకుడు ఏ.ఎల్ విజయ్‌కు కూడా తనకొక సంబంధం చూడమని చెప్పాను, మీరు కూడా మంచి అబ్బాయి ఎవరైనా ఉంటే నాతో చెప్పండి అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది.దీనిపై మరింత చదవండి :