మేము ఇంకా ముప్పైలలోనే ఉన్నాం.. చేయాల్సింది చాలా ఉంది

ప్రీతి చిచ్చిలి| Last Updated: గురువారం, 30 మే 2019 (14:42 IST)
చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, ఉపాసనల పెళ్లి జరిగి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో త్వరలో ఏడవ పెళ్లి రోజు జరుపుకుంటున్న ఈ జంట మేము కలిసి ఇంకా జీవితంలో సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. 
 
ప్రస్తుతం చెర్రీ, ఇద్దరూ దక్షిణాఫ్రికా విహారయాత్రలో గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఉపాసన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంచరణ్‌ గురించి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
 
‘చరణ్‌కు ప్రేమలో పడటంపై అంతగా నమ్మకం లేదు. తను ప్రేమలో నుండి ఎదగాలనుకుంటాడు. ఇది వినడానికి కాస్త వెరైటీగా అనిపిస్తుందనుకోండి. మా ఇద్దరికీ పెళ్లి జరిగి అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నాము. ఇద్దరం ఇంకా ముప్పైల వయసులోనే ఉన్నాము, కాబట్టి మేమింకా సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి. 
 
ప్రతి పెళ్లి రోజుకీ మేము ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోవాలని నిర్ణయించుకుంటూ ఉంటాము. జూన్‌ 14న మా పెళ్లిరోజు వస్తుంది. కానీ రాంచరణ్ జూన్ నుండి షూటింగ్‌లతో బిజీగా ఉంటారు కాబట్టి మేం ముందుగానే మా పెళ్లిరోజును జరుపుకోవాలని అనుకున్నాము. ఆయన కాలికి గాయం కావడంతో షూటింగ్ నుండి కాస్త విరామం తీసుకున్నారు. మేమిద్దరం నడవడానికి బాగా ఇష్టపడతాము, కానీ ప్రస్తుతం గాయం ఇంకా తగ్గనందువలన ఎక్కువగా తిరగకుండా ఎంజాయ్‌ చేస్తున్నాము’ అని వెల్లడించారు ఉపాసన.దీనిపై మరింత చదవండి :