సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (19:13 IST)

మెగా ఫ్యామిలీలో నాకో వ్యక్తి చాలా ఇష్టం.. శ్రీరెడ్డి మనసులో ఏముందో? (video)

కాస్టింగ్ కౌచ్ వివాదంతో పేరు తెచ్చుకున్న నటి శ్రీరెడ్డి మొదటి నుండి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు చేసే సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఆమె చేసిన రచ్చ అందరికీ తెలుసు.


ఇక ఇటీవల నాగబాబును టార్గెట్ చేస్తూ యూట్యూబ్ వీడియోలను రిలీజ్ చేస్తున్న శ్రీరెడ్డి మెగా అభిమానులకు బద్దశత్రువుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో చిరంజీవి కుటుంబంలో ఒకరి గురించి ఆమె పాజిటివ్‌గా పెట్టిన పోస్ట్ సంచలనం రేపుతోంది.
 
‘ఆశ్చర్యకరంగా చిరంజీవి కుటుంబంలో ఒక వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం. మచ్చలేని వ్యక్తి, స్ఫూర్తిప్రదాత. ఎవరో ఊహించగలరా’ అంటూ ఫేస్‌బుక్‌లో శ్రీరెడ్డి చేసిన పోస్ట్‌కు రామ్ చరణ్, అల్లు అర్జున్ పేర్లతో పాటుగా సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అరవింద్, శిరీష్ ఇలా అందరి పేర్లు కనిపించాయి. ఆ తర్వాత సర్ప్రైజ్ రివీల్ చేస్తూ శ్రీరెడ్డి పోస్ట్ చేసిన వ్యక్తిని చూసి అందరు ఆశ్చర్యపోయారు. 
 
ఆ వ్యక్తి ఎవరంటే రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల. ‘అవును, నేను చెప్పిన వ్యక్తి ఈవిడే. నాకు ఎంతో దగ్గరి వ్యక్తిగా భావిస్తాను. వినయం విధేయత కలిగిన గొప్ప వ్యక్తి, కష్టపడే తత్వం, ఎంతో సరదాగా ఉంటుంది, ఫ్యామిలీ లేడీ, సక్సెస్‌ఫుల్ లేడీ. ఆవిడ మరెవరో కాదు స్ఫూర్తిదాయకమైన మహిళ ఉపాసన రెడ్డి కామినేని’ అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. 
 
ఇందులో ఉపాసన కొణిదెల అని కాకుండా ఉపాసన రెడ్డి కామినేని అని రాసి మెగా ఫ్యామిలీపై తన ద్వేషాన్ని మరోసారి చూపించింది శ్రీరెడ్డి. కానీ, అసలు ఉపాసన ప్రస్తావన ఇప్పుడెందుకు తీసుకువచ్చిందో, తన మనసులో ఏముందో తనే చెప్పాలి మరి.