గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 13 ఏప్రియల్ 2019 (22:08 IST)

జగన్ లడ్డూ కావాలా నాయనా..లడ్డూ.. జె.సి. సంచలన వ్యాఖ్యలు

ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే అనంతపురం మాజీ ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ చంద్రబాబునాయుడు పైనే విమర్శలు చేసి చివరకు వెనక్కి తగ్గిన జె.సి.దివాకర్ రెడ్డి తాజాగా కులాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఎపిలో కుల పిచ్చి తారాస్థాయిలో ఉందని, కుల పిచ్చి తగ్గితేనే రాజకీయాలు బాగుపడుతాయన్నారు. రాజకీయాల్లో ఉన్న చాలామందికి కులపిచ్చి ఎక్కువగా ఉందని, దానివల్లే రాజకీయాలు మలినమైపోతున్నాయని చెప్పారు. అది జగన్ పార్టీయా, మా పార్టీయా.. వేరే పార్టీయా అన్నది ముఖ్యం కాదు. అందరిలోను ఈ పిచ్చి కనబడుతోంది. ఈ పిచ్చి పోవాలి. అంతేకాదు జగన్ పగటి కలలు కంటున్నాడు. 
 
నేను టివిలో ఒక యాడ్ చూశాను. బాబూ... లడ్డూ కావాలా నాయనా లడ్డూ. అలా తయారైంది జగన్ పరిస్థితి. అధికారం కోసం జగన్ పడే పాట్లు చూస్తుంటే నవ్వొస్తుంది. ఇప్పటికైనా పగటికలలు మానుకో అని అన్నారు జె.సి.దివాకర్ రెడ్డి.