గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (11:37 IST)

జగన్ వెంట జనసునామీ.. ఏపీలో సువర్ణ పాలన : విజయసాయిరెడ్డి

వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి తోడు జనసునామీ వచ్చిందనీ దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణాంధ్ర పాలన రానుందని వైకాపా రాజ్యసభసభ్యుడు విజయసాయి రెడ్డి అన్నరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణాధ్యాయం మొదలైందని, జగన్ వెంట జన సునామీ నిలిచిందన్నారు. 
 
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ''టీడీపీ గూండాల దౌర్జన్యాలు, కులమీడియా బెదరగొట్టే వార్తలను పట్టించుకోకుండా జన సునామీ జగన్ వెంట నిలిచింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు, రాక్షస పాలనను అంతం చేసేందుకు ప్రజానీకం చూపిన చొరవకు శిరసు వంచి వందనం చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్‌లో సువర్ణాధ్యాయం మొదలైంది' అని వ్యాఖ్యానించారు. 
 
అంతేకాకుండా, 'నియంతలు పాలించిన దేశాల్లో కూడా ఎన్నికల్లో ఇన్ని అరాచకాలు జరిగి ఉండవు. వేల కోట్ల రూపాయలను వెదజల్లాడు. తమిళనాడు మద్యం అంతా ఆంధ్రాకి దారి మళ్లించాడు. వైఎస్సార్ సానుభూతి పరుల ఇళ్లకు మంచి నీళ్లు వెళ్లకుండా పైపులైన్లను ధ్వంసం చేశారు. అయినా ప్రజా ప్రభంజనాన్ని అడ్డుకోలేక పోయావు చంద్రబాబు' అని అన్నారు.