శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (12:20 IST)

సత్తెనపల్లిలో కోడెలపై వైకాపా దాడి.. మోకాలికి గాయం...

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా అనేక ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, వైకాపా, టీడీపీల మధ్య పోటాపోటీ ఉన్న ప్రాంతాల్లో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. 
 
విపక్ష పార్టీ వైకాపా శ్రేణులు మాత్రం రెచ్చిపోతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతున్న అధికారులపైనా వారు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం ఇనుమెట్లలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారు. వీరిమధ్య జరిగిన తోపులాటలో స్పీకర్‌ కోడెల చొక్కా చిరిగిపోయింది. 
 
ఆ సమయంలో ఆయనకు అడ్డుగా నిలిచిన గన్‌మెన్లపై రాళ్లతో దాడి చేశారు. దీంతో వాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో కోడెల మోకాలికి కూడా చిన్నపాటి రక్తగాయమైంది.