బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2019 (15:35 IST)

ఎమీ ప్రెగ్నెంట్.. శ్రద్ధా కపూర్‌ను సంప్రదిస్తే.. ట్రిపుల్ ఆర్‌కు..?

బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ పనుల్లో బిజీబిజీగా వున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ సరసన డైసీని తీసుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 
 
ఇంకా ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం రాజమౌళి వేట మొదలెట్టారు. ఈ క్రమంలో సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను ట్రిపుల్ ఆర్ టీమ్ సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ డేట్స్ అడ్జెట్స్ కాకపోవడంతో ఈ సినిమాలో నటించేందుకు శ్రద్ధా కపూర్ అంగీకరించలేదని సమాచారం. 
 
శ్రద్ధా కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం ఎమీ జాక్సన్‌ను వరించిందట. కానీ ఆమె ప్రెగ్నెంట్‌గా వుండటంతో ఆ ఛాన్స్ కాస్త జారిపోయిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.