స్వామి నన్ను ఆశీర్వదించారు.. ఆ ఆలయంలో రోజా ప్రత్యేక పూజలు, మరి మంత్రి పదవీ?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రెండవసారి రోజా విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తన సొంత నియోజకవర్గం నగరిలోనే ఎన్నికల ముందు వరకు గడిపిన రోజా గెలిచిన తరువాత ఇప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్సనలో బిజీగా ఉన్నారు. నగరిలో గెలుపొందిన తరువాత ప్రజలకు, వైసిపి కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన రోజా ఇప్పుడు కొన్ని ఆలయాల్లో పూజలను నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ లోని మణికొండలో రోజా నివాసముంటోంది. ఆ ప్రాంతంలోని సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించింది రోజా. తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే ఆలయంలో అభిషేకం నిర్వహిస్తానని స్వామివారిని కోరుకుంది రోజా. అనుకున్న విధంగానే ఆమె ఎన్నికల్లో గెలుపొందింది.
దీంతో స్వామివారు తనను ఆశీర్వదించారంటూ ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సమేతంగా స్వామివారి ఆలయంలో అభిషేకంలో పాల్గొన్నారు రోజా. స్వామివారి తీర్థప్రసాదాలను చేతపట్టుకుని ఒక ఫోటో దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇకపోతే రోజాకి కేబినెట్లే కీలక మంత్రి పదవి దక్కే అవకాశం వుందని అంటున్నారు. మరికొందరేమో స్పీకర్ పదవి వస్తుందని అంటున్నారు. మరి... ఆమెకి దేవుడు ఏ పదవి ఇస్తాడో చూడాలి.