1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Seven Headed Cobra Find Near Mekedatu, karnataka

కర్ణాటకలో ఏడు తలల నాగుపాము..? (video)

Seven Headed cobra
కర్ణాటకలో ఏడు తలల నాగుపాము కుబుసం కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఏడు తలల నాగుపాముకు సంబంధించిన కుబుసం కనిపించగానే ప్రజలు పసుపుకుంకుమలు పెట్టి.. పువ్వులు చల్లి ఆ కుబుసానికి పూజలు చేస్తున్నారు. ఏడు తలల అరుదైన నాగుపాము కర్ణాటకలోని మెకెడటు అనే ప్రాంతంలో సంచరిస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. 
 
సాధారణంగా ఒక తల నాగుపాము కనబడితేనే ప్రజలు దానిని నాగరాజుగా భావిస్తారు. అలాంటిది.. ఏడు తలల నాగుపాము కనిపించకపోయినా.. ఆ కుబుసం కర్ణాటకలోని రామనగర ప్రాంతంలో కనిపించగానే.. ప్రజలు కుబుసాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. ఎందుకంటే.. ఏడు తలల నాగరాజు దేవాంశసంభూతుడు. శ్రీ మహావిష్ణువు ఈ ఏడుతలల ఆదిశేషువుపైనే శయనిస్తారు. 
 
అలాంటి ఏడు తలల నాగపామును చూస్తేనే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు. దీనికోసం ఏడు తలల కుబుసాన్ని చూసేందుకు రామనగర ప్రాంతానికి సమీపంలో గ్రామ ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఆ కుబుసానికి పూజలు చేస్తున్నారు.