మహర్షి : 'పాలపిట్ట' వీడియో సాంగ్ రిలీజ్ (వీడియో)
సూపర్‌స్టార్ మహష్‌బాబు తాజా చిత్రం మహర్షి ఈనెల 9న విడుదలై సంచలన విజయం నమోదు చేసుకుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ సరసన పూజాహెగ్దే నటించగా, అల్లరినరేష్ ఓ కీలక పాత్ర పోషించాడు. రీసెంట్‌గా ఈ సినిమాలోని 'పాలపిట్ట' వీడియో సాంగ్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్‌కి శ్రీమణి సాహిత్యం అందించాడు. 'పాలపిట్టలో వలపు నీపైట మెట్టుపై వాలిందే'.. 'పిల్లా నాగుండెలోన ఇల్లే కట్టేసినావే'.. అంటూ సాగే ఈ పాటను , రాహుల్ సిప్లిగంజ్, ఎమ్ఎమ్ మానసి పాడారు. రాజు సుందరం కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో మహేష్, పూజాహెగ్దే కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ వీడియో సాంగ్‌ను మీరు కూడా చూసేయండి.