శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 21 మే 2019 (18:22 IST)

మహర్షి సినిమా మేకింగ్ వీడియోని చూశారా? (వీడియో)

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కెరీర్‌లో 25వ చిత్రంగా విడుదలైన మహర్షి సినిమా థియేటర్లలో కలెక్షన్‌ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమా మేకింగ్ వీడియోని చిత్రబృందం మంగళవారం అభిమానుల కోసం సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియోలో ఓ గ్రామాన్ని సృష్టించడం, మహేశ్‌బాబు యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడం తదితర అంశాలను చూపించారు. 
 
షూటింగ్ సమయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి, మహేశ్‌బాబు సీనియర్ నటులతో ముచ్చటించడం ఎంతో సందడిగా ఉంది. పూజా హెగ్దే కథానాయికగా నటించారు. అల్లరి నరేష్ 'రవి' అనే కీలకపాత్రను పోషించారు.
 
ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం మేకింగ్ వీడియోపై ఓసారి లుక్కేయండి..