బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 21 మే 2019 (16:56 IST)

వెండితెర దర్శకుడుగా శ్రీహరి కుమారుడు...

తన నటనతో తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో గొప్ప స్థాయి సంపాదించుకుని రియల్ స్టార్‌గా ఎదిగిన వారు శ్రీహరి. విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా అన్ని రకాల పాత్రలు చేసారు. మంచి మంచి పాత్రలు వేస్తూ అందరినీ అలరిస్తున్న సమయంలో దురదృష్టవశాత్తూ ఆయన మనకు దూరం అయ్యాడు. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆయన్ను ఎప్పటికీ మరచిపోలేరు. 
 
1991లో ఆయన సినీ నటి డిస్కో శాంతిని వివాహం చేసుకున్నారు. వీరికి మేఘాంశ్, శశాంక్ ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మేఘాంశ్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌‌లో మేఘాంశ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో కార్తిక్‌, అర్జున్‌‌లు దర్శకులుగా పరిచయం కాబోతున్నారు. సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా సాగుతోంది. లక్ష్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎంఎల్‌వీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమాకు "రాజ్‌ధూత్" అనే పేరు ఖరారైంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. శ్రీహరి స్టంట్‌ ఫైటర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత నటుడిగా ఎదిగారు. అనేక చిత్రాల్లో నటించి రియల్ స్టార్ బిరుదు స్వంతం చేసుకున్నారు. తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడుతూ సీరియస్ ఎక్స్‌ప్రేషన్‌లతో అందరినీ నవ్వించాడు. 2013 అక్టోబర్‌లో ముంబైలో ఓ హిందీ సినిమా షూటింగ్‌లో ఉండగా శ్రీహరి గుండెపోటుతో కన్నుమూశారు.