సంబంధిత వార్తలు
- ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ : తెలంగాణాలో బీజేపీ - కాంగ్రెస్‌లకు జీరో
- కూల్‌డ్రింక్‌లో మత్తుపదార్థాలు కలిపి....
- తెలుగు రాష్ట్రాల ఆక్టోపస్.. ఎన్నికల పంచాంగం.. ఏపీలో సైకిల్... తెలంగాణలో కారు
- నమ్మించి తీసుకెళ్లాడు.. ఫోన్ చేసి ఫ్రెండ్స్‌ను పిలిచి రేప్ చేశాడు...
- ప్రేమ పెళ్ళికి పెద్దలు అంగీకరించరని స్కూల్లో ఆ పనిచేసిన ప్రేమజంట...
పిడుగుపాటుకు బలైన పేద రైతు కుటుంబం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
వికారాబాద్ జిల్లా రాజాపూర్‌లో పిడుగు పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. వికారాబాద్ జిల్లా దారుర్ మండలం రాజాపూర్ గ్రామంలో పొలంలో పనిచేసుకుంటోంది ఓ పేద రైతు కుటుంబం. ఇంతలో భారీగా ఉరుములు, మెరుపులు వచ్చాయి. ఐతే వాటిని లెక్కచేయకుండా ఆ కుటుంబం తమ పొలంలో పనులు చేస్తూ వున్నారు.
ఇంతలో భారీ శబ్దంతో వారిపై పిడుగు పడింది. దాంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. తల్లి, కొడుకు, కూతురు చనిపోగా తండ్రి పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. తల్లి ఖాజాబీ(45) కూతురు తబస్సుమ్(16) కుమారుడు అక్రమ్(12) అక్కడికక్కడే మృతి చెందారు.
తండ్రి ఫక్రుద్దీన్ ఈ నలుగురు కుటుంబ సభ్యులు పొలంలో పని చేస్తుండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.. పిడుగుపాటుకు పక్క పొలంలో ఉన్న మేకలు కూడా చనిపోయాయి.
