తెలుగు రాష్ట్రాల ఆక్టోపస్.. ఎన్నికల పంచాంగం.. ఏపీలో సైకిల్... తెలంగాణలో కారు

Last Updated: శనివారం, 18 మే 2019 (18:34 IST)
ఆంధ్రా ఆక్టోపస్ కాదు కాదు.. తెలుగు రాష్ట్రాల ఆక్టోపస్ అని చెప్పుకోవాల్సిన మాజీ కాంగ్రెస్ నేత, పారిశ్రామిక వేత్త లగడపాటి రాజగోపాల్.. ఎన్నికల ఫలితాలపై సర్వే నిర్వహించారు. ఈ మేరకు శనివారం మీడియా సమావేశంలో సర్వేలో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనే అంశాన్ని బయటపెట్టారు. 
 
తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు, తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రజలు ఓటేశారని లగడపాటి చెప్పుకొచ్చారు. ఆంధ్రా డబ్బుల్లేని లోటు బడ్జెట్ ప్రాంతం కాబట్టి తెలుగు ప్రజలకు సైకిలే దిక్కైందని చెప్పారు. 
 
అలాగే మిగులు బడ్జెట్ వున్న ప్రాంతం కాబట్టి.. ప్రజలు కారును ఎన్నుకున్నారని తెలిపారు. ఇప్పుడు తాను చెప్తున్నది అంచనా మాత్రమే. అయితే తమ బృందం శాస్త్రీయంగా పరిశీలించి అభిప్రాయాలు సేకరించారు.. ఎలా తేల్చారనే విషయాన్ని తిరుపతిలో ఆదివారం చెప్తానని లగడపాటి అన్నారు.దీనిపై మరింత చదవండి :