శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 19 మే 2019 (18:45 IST)

ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ : తెలంగాణాలో బీజేపీ - కాంగ్రెస్‌లకు జీరో

దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆదివారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. 
 
తుదివిడతలో 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. కాగా, ఓ అభ్యర్థికి చెందిన నగదు పెద్ద మొత్తంలో లభించడంతో వేలూరు స్థానం ఎన్నిక రద్దు అయింది. ఈ ఎన్నికను రద్దు చేసినట్లు ఇటీవలే అధికారులు ప్రకటించారు.
 
కాగా, తుది విడత పోలింగ్‌లో సాయంత్రం 6 గంటల వరకు యూపీలో 54.37 శాతం, పంజాబ్‌లో 58.81 శాతం, మధ్యప్రదేశ్‌లో 69.38, బెంగాల్‌లో 73.05, హిమాచల్ ప్రదేశ్‌లో 66.18 పోలింగ్ నమోదైంది. 
 
ఇకపోతే ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వే ఫలితాలను వెల్లడించారు. ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఫలితాలను వెల్లడించారు. ఇందులో అధికార తెరాసకు 14 నుంచి 16 ఎంపీ సీట్లు రావొచ్చని వెల్లడించారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి సున్నా లేదా రెండు సీట్లు, బీజేపీకి సున్నా లేదా ఒక్క స్థానం లభిస్తాయని, ఎంఐఎంకు ఒక స్థానం వస్తాయని ప్రకటించారు.