శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 28 జనవరి 2019 (20:40 IST)

తిరుమలలో మీడియా కెమేరాలు చూసి పరుగెత్తిన లగడపాటి... ఎందుకో తెలుసా?

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కి పరుగులుపెట్టడం కొత్తేమీ కాదు. కాకపోతే ఈసారి తిరుమలలో పరుగులు పెట్టారు. ఇంతకీ అసలు విషయం ఏంటో ఆయన మాటల్లోనూ చూద్దాం... నాకు బుద్ధొచ్చింది. కాదు..కాదు.. బుద్ధి వచ్చేలా చేశాడు వెంకన్న స్వామి. మళ్ళీ బుద్థుంటే రాజకీయాలను తిరుమలలో మాట్లాడను.
 
నాకు ముందే తెలుసు. రాజకీయాల గురించి తిరుమలలో మాట్లాడితే ఏదో ఒకటి జరుగుతుందని బాగా తెలుసు. కానీ తప్పు చేశా. తెలంగాణా ఎన్నికల ఫలితాలపై నేను ఒక సర్వే చేసి ఆ విషయాన్ని బయట పెట్టాను. అదంతా రివర్సయ్యింది.
 
నాకెందుకో తిరుమలకు వచ్చినప్పుడల్లా అదే గుర్తుకు వస్తోంది. నేను సర్వే వివరాలు చెప్పిన తరువాత రెండుసార్లు తిరుమలకు వచ్చా. భక్తులను చూస్తేనే నాకు గిల్టీగా ఉంది... అంటూ పరుగులాంటి నడకతో చెప్పారు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్. తిరుమల శ్రీవారిని దర్సించుకున్న లగడపాటి మీడియా ప్రతినిధులను చూసి పరుగులు పెట్టారు. కారు ఎక్కే ముందు ఈ విషయాన్ని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయారు.