మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: మంగళవారం, 18 డిశెంబరు 2018 (17:13 IST)

రాసుకోండి... చంద్రబాబు ఇచ్చిన డబ్బుల్తో కొన్నానని... శివాజీ చిందులు

ఆమధ్య శివాజీ తను చేస్తున్న ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమానికి మీడియానే వెన్నుదన్ను అని చెప్పుకుంటూ వుండేవారు. అకస్మాత్తుగా ఏమయింది తెలీదు కానీ ఇటీవలి కాలంలో మీడియా మైకులు ఆయన వద్దకు తీసుకెళ్తుంటే చిందుకు తొక్కుతున్నారు.

తాజాగా ఆయన కృష్ణా జిల్లా గన్నవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కనబడ్డారు. గన్నవరంలో రెండు ప్లాట్లు కొనుగోలు చేయగా వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అక్కడికి వెళ్లారు. అంతే... మీడియావారు మైకులు తీసుకుని శివాజీ వద్దకు వెళ్లారు. వారిని చూడగానే శివాజీ చిందులు తొక్కారు. 
 
ఏంటయ్యా... ఏం రాస్తారూ మీరు. మహా అయితే చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో నేను ప్లాట్లు కొన్నాను అని రాస్తారు అంతేగా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన శివాజీ అకస్మాత్తుగా చంద్రబాబు ఇచ్చిన డబ్బు అని ఎందుకు అన్నారో తెలియక అక్కడున్నవారు చూస్తూ నిలబడ్డారు. ఇంతలో శివాజీ మాత్రం మరింత వేగంగా కారెక్కి వెళ్లిపోయారు.