శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శుక్రవారం, 30 నవంబరు 2018 (20:05 IST)

అక్కడ చెయ్యెస్తే కొట్టినంత పనిచేస్తుంది... ఏం చేయాలి?

రాత్రివేళ నా భార్యతో చెప్పుకోలేని సమస్యను ఎదుర్కొంటున్నాను. ఆ సమయంలో తన శరీరంపై చేయి వేయనివ్వదు. పరిమితమైన శృంగారం చేయమంటుంది. ఎదపై చేయి వేసేందుకు ప్రయత్నిస్తే కొట్టినంత పనిచేస్తోంది. అలా చేస్తే వాటి ఆకృతుల్లో తేడాలొస్తాయనీ, ఆకృతులు మారిపోయి అగ్లీగా తయారవుతాయని మొండిగా మాట్లాడుతోంది. ఆమెతో పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేసే దారి ఏమిటో అర్థం కావడంలేదు...
 
కొంతమంది స్త్రీలలో ఇలాంటి మనస్తత్వం కనబడుతుంది. శృంగారంలో పాల్గొన్నా, భర్త గట్టిగా స్పర్శించినా తమ అందంలో తేడా వస్తుందనీ, ఆకర్షణ పోతుందని అనుకుంటుంటారు. కానీ ఇదంతా అపోహ మాత్రమే. ఎంత అందగత్తెలయినా వయసు పైబడేకొద్దీ అందంలో తేడాలు వచ్చేస్తాయి. 
 
అందాన్ని, ఆకృతుల ఫిట్నెస్‌ను అలాగే పట్టి ఉంచడం ఎంతోకాలం సాధ్యం కాదు. పిల్లలు కలిగితే ఆకృతుల్లో క్రమంగా తేడాలు వస్తాయి. ఐతే ఆ తర్వాత తగిన వ్యాయామంతో తిరిగి పూర్వ పరిస్థితిని పొందవచ్చు. కనుక అక్కడ పట్టుకున్నంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని ఆమెకు ఉదాహరణలతో వివరించి చెప్పండి. తప్పకుండా మారుతుంది.