శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : గురువారం, 29 నవంబరు 2018 (17:49 IST)

నాది జిమ్ బాడీ అని విర్రవీగేవాడిని... కానీ అక్కడ ఔటయ్యా...

నాది జిమ్ బాడీ. పర్ఫెక్ట్ ఫిగర్ మెయిన్‌టైన్ చేస్తుంటాను. ఆఫీసులో ఈమధ్య మా లేడీ బాస్‌కు నాకు మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలో మేము పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాము. ఇటీవలే తను కారు ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ నన్ను వారి తల్లిదండ్రులకు పరిచయం చేసింది. వారమ్మాయి కోరుకున్నవాడికిచ్చి పెళ్లి చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుందని అన్నారు. 
 
ఐతే ఈమధ్య ఆమెతో నేను ఏకాంతంగా గడిపే అవకాశం వచ్చింది. బాగా దగ్గరయ్యాం. కానీ నాకు విపరీతంగా చమట్లు పట్టేశాయి. నీళ్లుగారి పోయాను. స్పందించాల్సింది స్పందించకుండా పోయింది. ఆమె ప్రేరేపించినా స్పందన కలుగలేదు. దానితో వైద్యునికి చూపించుకోమని ఆమె సలహా ఇచ్చి ముఖం కందగడ్డలా పెట్టుకుని వెళ్లిపోయింది. ఈమధ్య ఫోన్ చేస్తే... డాక్టరుకి చూపించుకున్నావా లేదా అని అడుగుతోంది. ఇదంతా చూస్తుంటే నేను పెళ్లికి పనికి రానేమోనని అనుమానంగా వుంది. 
 
పెళ్లికి ముందు సహజంగా కొంత భయం వుంటుంది. శృంగారం చేసే సమయంలో స్పందన లేకుండా పోవడానికి కారణం లోపల గూడుకట్టుకుని ఉండే భయం కారణమై వుండొచ్చు. జిమ్ బాడీ అయినా మామూలు బాడీ అయినా శృంగార పరంగా కోర్కె ఉంటే చేయగల సామర్థ్యం ఉంటుంది. అదేసమయంలో మనసులో ఆందోళన, భయం ఉంటే ఎంత ప్రయత్నించినా దుర్లభమవుతుంది. ఎందుకైనా మంచిది... ఓసారి వైద్య సలహా తీసుకోవడం మంచిది.