శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (18:47 IST)

ఆయనతో ఆ క్షణాలు గుర్తుకొస్తే ఆగలేను... నా స్నేహితురాలేమో అలా అంటోంది...

మేమిద్దరం బాగా చదువుకున్నవాళ్లం. ఏడాది క్రితం పెళ్లయింది. మావారికి విదేశాల్లో మంచి ఉద్యోగం. నన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ మా అమ్మకు సుస్తీ చేయడంతో ఆమెను చూసుకునేందుకు ఇక్కడే ఉండాల్సి వస్తోంది. 6 నెలలుగా ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నా. శృంగార కోర్కెలను అదుపు చేసుకోలేకపోతున్నా. అందుకని వివిధ సాధనాల ద్వారా నా కోర్కెలకు తృప్తి చెందిస్తున్నా. ఇటీవల నా స్నేహితురాలికి నాకు మధ్య దీనిపై చర్చ వచ్చింది. స్వయంతృప్తి సాధనాల ద్వారా వాంఛకు తృప్తి కలిగిస్తే అనారోగ్యం, ఇతర సుఖవ్యాధులు వస్తాయని చెపుతోంది. ఇది నిజమేనా...?
 
ఇందులో ఎంతమాత్రం నిజంలేదు. స్వయంతృప్తి అనేది స్త్రీపురుషుల్లో సహజమైనదే. కోర్కెలను తాళలేని పరిస్థితి తలెత్తినపుడు ఈ మార్గాన్ని చాలామంది అనుసరిస్తుంటారు. వాస్తవం ఏంటంటే, కోర్కెలతో వున్నప్పుడు, వాటిని అదిమిపట్టి ఆపివేసుకుని శరీరాన్ని ఇబ్బందిపెట్టేకన్నా ఇలా స్వయంతృప్తిని పొందడం వల్ల మనసుకు, శరీరానికి స్వాంతన చేకూరుతుంది. కాబట్టి ఇదేమీ ప్రమాదమైనది కాదు.