శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 26 నవంబరు 2018 (13:09 IST)

భార్యపై అనుమానం... ఈ బిడ్డ నాకు పుట్టలేదంటూ దాడి

కట్టుకున్న భార్య ప్రవర్తనపై ఉన్న అనుమానం పెనుభూతమైంది. భార్యపై ఉన్న అనుమానంతో ఆర్నెల్ల చిన్నారిపై కసాయి భర్త దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలోని మోరాదాబాద్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మోరాదాబాద్‌కు చెందిన జాహిద్, తన భార్యకు ఆరు నెలల పసిపాప ఉంది. అయితే భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానం భర్త జాహిద్‌లో ఏర్పడింది. 
 
దీంతో ఆరు నెలల పాప జాహిద్‌కు పుట్టలేదని పుకార్లు షికారు చేస్తుండటంతో జాహిద్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో భార్యతో తరుచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. 
 
ఇంట్లో ఉన్న కత్తితో భార్యతో పాటు పసిబిడ్డపై దాడి చేశాడు. చిన్నారికి మెడపై గాయాలయ్యాయి. తల్లీబిడ్డలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.