శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Modified: మంగళవారం, 27 నవంబరు 2018 (20:29 IST)

పాత ప్రేయసిని మర్చిపోకలేకపోతున్నా... భార్య అలా చేసినా...

నాకు ఛాటింగులో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ ఛాటింగ్ మా ఇద్దరినీ బాగా ముందుకు తీసుకెళ్లింది. ఒక చిన్న విషయం దగ్గర కోపమొచ్చి కసిరాను. దాంతో ఆమె నాతో ఛాటింగ్ చేయడం మానేసింది. కొన్నాళ్లకు కోపం తగ్గి ఆమెతో ఛాటింగ్ చేద్దామని చూస్తే అన్నీ కట్ చేసి ఆచూకి లేకుండా పోయింది. తప్పు నాదేననిపిస్తుంది. ఆమెను మరచిపోలేకుండా ఉన్నాను. మరో అమ్మాయి నా జీవితంలోకి వచ్చి నన్ను శృంగారపరంగా సుఖపెడుతున్నా ఆ అమ్మాయే గుర్తుకు వస్తోంది. ఆమె గుర్తుకు వస్తే చాలా బాధగా ఉంటోంది. ఇది నాకు వదలదా...?
 
మీ జీవితంలోకి వచ్చిన అమ్మాయిలో కూడా నీ పాత ప్రేయసిని వెతుక్కుంటూ కూర్చుంటే మీ బాధ వదలదు. మొదటి అమ్మాయిలో మంచి గుణాలు ఉండి ఉంటాయి. అందరిలోనూ అలాంటి గుణాలే ఉండాలంటే ఉండవు కదా. జీవితంలో సెటిలయి సుఖంగా ఉండాలనుకుంటున్నారా.. లేదంటే ఇలా ఆలోచిస్తూ ఆరోగ్యం చెడగొట్టుకోవాలనుకుంటున్నారా... కాబట్టి ఆ జ్ఞాపకాలను వదిలేసి కొత్తగా మీ జీవితంలో అడుగుపెట్టిన అమ్మాయితో హాయిగా కాపురం చేసుకోండి.